ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో రోజు గడవాలంటే 50 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే! - Candidates spending money for assembly elections

Telangana Assembly Elections Expenditure 2023 : రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం ఖర్చు ఎంతైనా తగ్గేదేలే అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ జిల్లాలో బూత్​ స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు.. రెండు ప్రధాన పార్టీలు కలిపి రోజుకు అరకోటి వరకు ఖర్చు పెడుతున్నాయి.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 5:00 PM IST

Updated : Nov 20, 2023, 5:30 PM IST

Telangana Assembly Elections Expenditure 2023 : తెలంగాణలో ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) వేడెక్కింది. ఓ వైపు ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్, కాంగ్రెస్‌, బీజేపీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు, రోడ్​ షోలు, కార్నర్ మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో అభ్యర్థులు.. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినాయకుల వరకు అచితూచి అడుగులేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్​ కోసం కొందరు.. మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. తగ్గేదే లే అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

MLA Candidates Spending Money in Election Campaign : ఈ నేపథ్యంలోనే వికారాబాద్​ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లోని అన్ని వీధుల్లో.. ఓ రెండు ప్రధాన పార్టీలు బూత్‌స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో బూత్‌ పరిధి ప్రచారానికి ప్రతి రోజు రూ.5000 చొప్పున.. ఆ రెండు పార్టీలు కలిపి రూ.56,65,000 ఖర్చు చేస్తున్నాయి. వికారాబాద్‌, కొడంగల్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 1,133 బూత్‌లు ఉన్నాయి. పార్టీల కార్యకర్తలు వీధుల్లో అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ప్రచారం చేయడానికి ముందు ఉదయం 10 గంటలకే నిర్ణీత ప్రదేశాలకు చేరుకుంటున్నారు.

Parties Campaign in Telangana Assembly Elections 2023 : అక్కడే టిఫిన్​ చేసి టీలు తాగుతున్నారు. అనంతరం ప్రచారానికి బయల్దేరుతున్నారు. ఒంటి గంట వరకు తిరిగి ఉన్నచోటుకే చేరుకుంటున్నారు. ప్రచార నిర్వహణ చూస్తున్న నాయకులు.. కార్యకర్తల భోజనాలు, మద్యం కోసం నగదును ఖర్చు పెడుతున్నారు. వీలైతే కూలీ పనులు (Election Campaign in Telangana )మానేసి ప్రచారానికి వచ్చిన వారికి రోజూ కూలీ కూడా చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై గత బుధవారం నాడు స్పష్టత వచ్చింది.

ఎట్టెట్టా - యువజన బృందాలకు గోవా ఆఫర్లు - బూత్ స్థాయి నేతలకు మందు, విందు, పదివేలు పక్కా!

గురువారం నుంచి బూత్‌స్థాయిలో ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే రెండు నుంచి మూడు గ్రామాలకు కలిపి ఇంఛార్జ్​గా వ్యవహరిస్తున్న నేతలకు, బూత్‌స్థాయి ప్రచారం నిర్వాహకులకు గుట్టుగా డబ్బులను చేరవేస్తున్నారు. కార్యకర్తల్లో ఎక్కడా అసంతృప్తి లేకుండా చూసుకునేందుకు నాయకులు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : మరోవైపు దీనికి తోడుగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని పరిగెత్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన మహిళా సంఘాలను రంగంలోకి దింపుతున్నారు. జిల్లాల్లో చాలాచోట్ల వీటి ప్రచార బృందాలు సందడి చేస్తున్నాయి. వివిధ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి విద్యార్థులు జట్లుగా మండలాలకు చేరుకొని ప్రచారం చేస్తున్నారు.

అన్నా ఎటుపోతాంది రాజకీయం - తెలంగాణలో ఏడజూసినా గిదే ముచ్చట

ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?

Last Updated : Nov 20, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.