ETV Bharat / state

బీఆర్​ఎస్​కు దీటుగా ప్రతిపక్షాల ప్రచారం - కారు కట్టడికి కాంగ్రెస్‌, ఒక్క అవకాశం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు - జైరాం రమేశ్​ తెలంగాణ లో ఎన్నికల ప్రచారం

Telangana Assembly Elections Campaigns 2023 : ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులే సమయం మిగిలి ఉండడంతో.. అధికార బీఆర్​ఎస్​కు దీటుగా ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. కారు కట్టడికి కాంగ్రెస్‌, ఒక్క అవకాశం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు ఇరు పార్టీల అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు.. కేసీఆర్‌ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారానికి పదును పెడుతున్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారం
కాంగ్రస్​ బీజేపీ ఎన్నికల ప్రచారం
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 5:28 PM IST

కారు కట్టడికి కాంగ్రెస్‌ - ఒక్క అవకాశం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ

Telangana Assembly Elections Campaigns 2023 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy Campaign) హైదరాబాద్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌కు మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొన్నారు. మహేశ్వరం అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా.. కొత్తపేటలో ఎన్నికల ప్రచారానికి హాజరైన రేవంత్‌కు.. కాంగ్రెస్‌ శ్రేణులు గజమాలతో ఘనస్వాగతం పలికాయి. అనంతరం.. ముషీరాబాద్ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌ తరఫున.. రోడ్‌షోలో పాల్గొన్న రేవంత్‌కు.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జూబ్లీహిల్స్‌లో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నియోజకవర్గ అభ్యర్థి అజారుద్దీన్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Congress Election Campaign 2023 : నాంపల్లిలో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని నియోజకవర్గ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ ధీమా వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వస్తే.. కరెంటు కష్టాలు తప్పవని బీఆర్​ఎస్​ చేస్తున్నఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని.. గాంధీభవన్‌ వేదికగా పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ స్పష్టం చేశారు..

బీజేపీ కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

JaiRam Ramesh Tour In Telangana: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ మల్లు రవి.. తమ పార్టీ 90 నుంచి 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

MLA Sithakka Election Campaign : ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎమ్మెల్యే సీతక్క గడపగడపకు తిరుగుతూ.. తనను ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పలువురు బీఆర్ఎస్​, బీజేపీ కార్యకర్తలు సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పాలకుర్తిలో హస్తం అభ్యర్థిగా బరిలో నిలిచిన యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుస రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. నర్సంపేట దుగ్గొండి మండలంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తూ.. దొంతి మాధవరెడ్డి ఓట్లు అభ్యర్థించారు.

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

Congress Election Campaign In Telangana : నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్​ఎస్​ వైఫల్యాలను ఎండగడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలో.. తుంగతుర్తి అభ్యర్థి మందుల సామేలు ఎన్నికల ప్రచారం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న వివేక్‌వెంకటస్వామి.. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. బెల్లంపల్లిలో హస్తం అభ్యర్థి గడ్డం వినోద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Thummala Road Show : ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన రోడ్‌ షోలో.. కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పర్యటిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగ్‌రావు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిచారు. మెదక్ జిల్లా నరసాపూర్‌ మండలంలో ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.

Smriti Irani Tour In Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. పార్టీ అభ్యర్థులతో పాటు కమలం అగ్రనేతలు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ ఆనందనగర్‌లో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో.. కేంద్రమంత్రి స్మృతీఇరానీ(Central Minister Smriti Irani) పాల్గొన్నారు. అంబర్‌పేట్‌లో బీఆర్​ఎస్​ అభ్యర్థి కృష్ణయాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన యువ సమ్మేళనానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈనెల 27న మొదటిసారిగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌ షో ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

BJP Election Campaign : శేరిలింగంపల్లిలో రవికుమార్ యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. అనంతరం.. ఆల్విన్‌ కాలనీలో చేపట్టిన రోడ్‌షోలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్‌వింద్.. బీఆర్​ఎస్​ విమర్శలు గుప్పించారు. బాగ్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనానికి.. రాజ్యసభ సభ్యుడు లక్షణ్‌ హాజరయ్యారు.

'కాంగ్రెస్​లో అందరూ ముఖ్యమంత్రులే - వారివి మాత్రం ఆరు గ్యారెంటీలట'
JP Nadda Tour In Telangana : సంగారెడ్డిలో జరిగిన బీజేపీ సకల జనుల సంకల్ప సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హజరయ్యారు. సంగారెడ్డిలో పులిమామిడి రాజును, నారాయణఖేడ్‌లో సంగప్పను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీజేపీ అభ్యర్ధి కొండేటి శ్రీధర్‌కు మద్ధతుగా నిర్వహించిన సభకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగిత్యాలలో బోగ శ్రావణి గడపగడపకు వెళ్తూ కమలం గుర్తుకు ఓటెయ్యాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మంథని బీజేపీ అభ్యర్థి సునీల్‌రెడ్డి.. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

BSP Election Campaign : నిర్మల్ జిల్లా ముధోల్‌లో పార్టీ అభ్యర్థి రామారావుకు మద్దతుగా జరిగిన రోడ్‌ షోలో బీజేవైఎమ్​ మహిళ మోర్చ నాయకురాలు భార్గవి కల్యాణి పాల్గొన్నారు. పటాన్‌చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ పది అంశాలతో ప్రత్యేక మేనిఫోస్టోను.. సంగారెడ్డి జిల్లా చిట్కుల్‌లో విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో జరిగిన "చర్చాగోష్టి" కార్యక్రమానికి.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.

నల్గొండలో అంతుచిక్కని రాజకీయం-కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వర్సెస్​ కంచర్ల భూపాల్​రెడ్డి

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.