ETV Bharat / state

Telangana Elections 2023 : ఎన్నికల్లో ధనప్రవాహంపై ఈసీ ఫోకస్.. రంగంలోకి ఎన్​ఫోర్స్​మెంట్ ఏజెన్సీలు - Assembly Elections 2023

Telangana Assembly Elections 2023 : అటు అసెంబ్లీ ఎన్నికల్లోనైనా.. ఇటు పంచాయతీ ఎన్నికల్లోనైనా ధనప్రవాహం పెచ్చరిల్లుతోంది. అందులోనూ దక్షిణాది రాష్ట్ర రాష్ట్రాల్లో ఇది మరింత తీవ్రమవుతోంది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో జరిగిన మునుగోడు, హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో సుమారు వివిధ రాజకీయ పార్టీలు సుమారు రూ. 600కోట్లు ఖర్చు చేశాయని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం విలువ రూ.97 కోట్లు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకు ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్​గా తీసుకుంది. నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు సుమారు 20కి పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.

EC
EC
author img

By

Published : Jun 30, 2023, 1:09 PM IST

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వినియోగాన్ని అరికట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. ఇందుకోసం తొలిసారి 20కి పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను రంగంలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. తెలంగాణలో జరుగుతున్న డబ్బు ఖర్చు తీరుపై ఈసీ ఉన్నతాధికారుల బృందం ఆందోళన వ్యక్తం చేశారు.

Enforcement Agencies in Telangana : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఈ ఏజెన్సీలను పకడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈసీ ఆలోచిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో పోలీసు శాఖ, ఎక్సైజ్‌, ఇంటెలిజెన్స్‌, ఆదాయ పన్ను, సీఐఎస్‌ఎఫ్‌, రైల్వే తదితర విభాగాలు తనిఖీలు చేస్తుంటారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించి వారిని సమన్వయం చేస్తుంది.

ఈసారి మరిన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను రంగంలోకి దించాలని ఈసీ డిసైడ్​ అయ్యింది. పై విభాగాలతో పాటు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ), రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎన్‌సీబీ), కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), విదేశీ వ్యవహారాల ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోర్ట్స్‌, రవాణా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేసింది.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు, గత నాలుగు ఉపఎన్నికల్లో జరిగిన ఖర్చు అంచనాలను ఈ మీటింగ్​లో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఖర్చులను చూసి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వ్యయానికి సంబంధించి మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభావం ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తే పరిస్థితులను ఊహించడమే కష్టమని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీనికి అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తే డబ్బు ప్రవాహానికి కొంతమేరకైనా అడ్డుకట్ట వేయవచ్చని ఈసీ అభిప్రాయపడింది.

Telangana Assembly Election Expenditure : దానికి తగిన విధంగా ఆయా ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా అంశాలపై అధ్యయనం చేయాలని, త్వరలో జరిగే సమావేశంలో ప్రతి ఏజెన్సీ తన వ్యూహాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో వివరించాలని కోరింది. ఆయా ఏజెన్సీల నుంచి వచ్చే సలహాలపై ఉన్నతస్థాయిలో చర్చించి ఒక వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.