ETV Bharat / state

కరోనా నిబంధనలతో.. శాసనసభ, మండలి సమావేశాలు

తెలంగాణ శాసనసభ, శాసన పరిషత్​లో సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయిస్తున్నామని సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీ, బుధవారం రోజు కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.

telangana assembly and council sessions
శాసనసభ, మండలి సమావేశాలు
author img

By

Published : Oct 12, 2020, 3:38 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా.. సభ్యులంతా భౌతిక దూరం పాటించేలా శాసనసభ, శాసన పరిషత్​లో సీటింగ్ ఏర్పాటు చేయిస్తున్నట్లు సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 13న అసెంబ్లీ, 14న కౌన్సిల్ సమావేశాలున్నందున.. ఏర్పాట్లను శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులతో కలిసి పరిశీలించారు.

సభా ప్రాంగణాలను, సభ లోపలి ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలని కార్యదర్శిని ఆదేశించారు. సమావేశాల బందోబస్తు​పై డీజీపీ, నగర పోలీస్ కమిషనర్​తో ఫోన్​లో మాట్లాడారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.