Seed Testing Lab in Hyderabad: రాష్ట్రం నుంచి విత్తనాల ఎగుమతికి మరింత అవకాశం కలుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అంతర్జాతీయ విత్తన నాణ్యత పరీక్ష ప్రయోగశాలను మంత్రి ప్రారంభించారు. రూ.6.5 కోట్ల వ్యయంతో విత్తన ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక, సాంకేతిక ప్రయోగశాల అందుబాటులోకి రావడం వల్ల విత్తనాల ఎగుమతి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న క్రియాశీల నిర్ణయాల వల్ల సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. వరిలో పంజాబ్‌ను తలదన్నామని.. నాణ్యమైన పత్తిలో ప్రథమ స్థానం.. సాగు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్నామని మంత్రి వివరించారు. ఒకప్పుడు మెట్టపంటలకే ప్రాధాన్యం ఉన్న తెలంగాణలో ఇక్రిసాట్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం మాగాణి సాగు విస్తీర్ణమే.. కోటి ఎకరాలకు పెరిగిందని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకం. వ్యవసాయ అభివృద్ధి, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికం. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్‌ఏఓ వెల్లడించింది. సీఎం కేసీఆర్ నిర్ణయాలే ఇందుకు కారణం.
- నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
ఇదీచూడండి: KTR On Forest restoration : 'దేశంలోని రాష్ట్రాలన్ని తెలంగాణను ఫాలో అవ్వాల్సిందే'