Telangana Agricultural Sector Development : తెలంగాణ వ్య వసాయ రంగం ప్రగతిపథంలో సాగుతోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చి..సానుకూల విధానాలు అవలంభించడంతో సాగులో వృద్ధి సాధ్యమైంది. ఫలితంగా పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు ఉండగా... 2022-23 నాటికి 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం కోటి 7 లక్షల ఎకరాలు అంటే... 81.6 శాతం. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా.. 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3 కోట్ల టన్నులకు చేరింది.
Telangana Agricultural Sector Development in 10 Years : రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి లక్షా 33 వేల కోట్ల రూపాయల వ్యయంతో 722.92 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేసి సర్కారు రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ డెక్కన్‌లో పదేళ్ల తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార ప్రగతి నివేదికను.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్న కలల వైపు.. తెలంగాణ పయనిస్తుందని మంత్రి తెలిపారు. యువత వ్యవసాయ రంగం వైపు రాకుంటే దేశానికి భవిష్యత్ లేదని.. ఆయుధాలను కొనగలరేమో కానీ, ఆహార ధాన్యాలు మాత్రం కొనలేరని స్వామినాథన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
G20 Agriculture Ministers Meet : '9 ఏళ్లలో భారత వ్యవసాయం.. సుసంపన్నం.. శక్తిమంతం'
''తెలంగాణ రైతన్నల కష్టం, సాగునీళ్లు, ఆనాటి శిథిలమైన వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కరెంటు కోతలు వీటి నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ వచ్చాక ప్రథమ ప్రాధాన్యం వ్యవసాయ రంగానికి ఇవ్వడంతో రాష్ట్రంలో అద్బుతమైన ప్రగతి జరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. భారత దేశంలో తెలంగాణను ఒక మోడల్‌గా నిలబెట్టినం. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్న కలల వైపు.. తెలంగాణ పయనిస్తోంది. యువత వ్యవసాయ రంగం వైపు రాకుంటే దేశానికి భవిష్యత్ లేదు. ఆయుధాలను కొనగలరేమో కానీ, ఆహార ధాన్యాలు మాత్రం కొనలేరని స్వామినాథన్ చెప్పారు.'' - నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Niranjan Reddy on TS Agriculture Sector Progress : రాష్ట్రంలో 58 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరందుతోంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషి సాగుతోంది. 5,349 కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించడం ద్వారా 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. సాగు నీటి శిస్తు రద్దు సహా.... దాదాపు 10,500 కోట్ల రూపాయలు భరిస్తూ రాష్ట్ర రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా సాగుతోంది.
ఆరోగ్యం కోసం ఆర్గానిక్ వైపు.. యువ జంట కొత్త ఆలోచన
Telangana Farmers Development : ఏటా పంట కాలం ఆరంభంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున గత 11 విడతల్లో 72 వేల 815 కోట్లుపంపిణీ చేసింది. రైతు భీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు 5,566 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు జరిగింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మొదటి విడతలో 35.31 లక్షల రైతులకు 16,144.10 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది.
వ్యవసాయం అనేది సుస్థిర, భరోసా గల రంగంగా దేశంలో తెలంగాణ రికార్డు సాధించింది. ఒకప్పుడు టీఎస్ ఆగ్రోస్, విజయ డెయిరీ లాంటి సంస్థలు నష్టాలబాటలో ఉంటే ఇప్పుడు లాభాల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ వ్యవసాయ పథకాలు ఉన్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతున్నాయి. పదేళ్లకాలంలో కొత్తగా సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పెరిగింది. జియోగ్రఫికల్ ఏరియా 3 శాతం నుంచి 5.25 శాతం పెరిగింది. రాష్ట్రంలో 4.3 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. పచ్చదనం శాతం కూడా పెరిగింది.
KTR Tweet on Telangana Agriculture : 'వ్యవసాయం దండుగ అన్నచోటే.. పండుగైంది'