ETV Bharat / state

మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు.. బడ్జెట్​లో ఎంత కేటాయించారంటే? - Allocations in Telangana Budget

Funding for metro rail in Telangana budget: తెలంగాణ 2023-24 బడ్జెట్​లో హైదరాబాద్​లో మెట్రో విస్తరణకు పెద్దపీట వేశారు. ఇవాళ శాసనసభలో బడ్జెట్​ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి హరీశ్​రావు.. మొత్తం బడ్జెట్​లో మెట్రో రైలు అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు కేటాయించారు. ఇందులో పాతబస్తీలో మెట్రోలైన్​ కొరకు రూ. 500 కోట్లు నిధులు కేటాయించారు.

Funding for metro rail in Telangana budget

author img

By

Published : Feb 6, 2023, 4:07 PM IST

Funding for metro rail in Telangana budget: 2023-24 తెలంగాణ బడ్జెట్​లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖ, సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కారు.. ఐటీ రంగంతో పాటుగా.. మెట్రో రైలు అభివృద్దికి భారీగా నిధులు మంజూరు చేసింది. ఈసారి మెత్తం బడ్జెట్​లో మెట్రో రైలు కోసం రూ.1500కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందులో పాతబస్తీలో ట్రాక్ నిర్మాణం, వసతుల కోసం రూ.500 కోట్లు కేటాయించింది.

Allocations in the budget for infrastructure development: రాజధాని నగరంలో మౌలిక వసతులను మెరుగు పరచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని హరీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్​లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు, ఆర్వోబీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో 31 పూర్తి చేయటం జరిగిందని.. మిగతా 11 ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని మంత్రి శాసనసభలో ప్రకటించారు.

ఇప్పటికే రూ.275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపిన మంత్రి హరీశ్​రావు.. దీనివల్ల ప్రయాణ దూరం, ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలుష్యం తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు. రూ. 76.65 కోట్లతో చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో 9 వంతెనలు పూర్తయ్యాయని.. మిగతా వాటి పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రకటించారు.

విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ: శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపిన మంత్రి.. విమానాశ్రయంలో సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణం చేసినా సరిపడే విధంగా విమానాశ్రయ విస్తరణ పనులు రూ.7500 కోట్లతో జరుగుతున్నాయని సభలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది జూన్ లోపల పూర్తై, ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రోజురోజుకూ పెరుగుతున్న విమాన ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి తొందరగా చేరుకోవడానికి మెట్రో రైలును ఎయిర్ పోర్ట్​కు అనుసంధానం చేస్తూ ‘ఎయిర్ పోర్టు మెట్రో’కు ప్రభుత్వం రూపకల్పన చేసిందని పేర్కొన్నారు. ఈ మెట్రో మార్గం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలై శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్​రావు తెలిపారు.

ఇటీవలే ఈ పథకానికి సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేయడం చేశారని గుర్తుచేశారు. మొత్తం రూ. 6250 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో వచ్చే మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.