వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రబీలో 77.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసినట్లు మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజ్ స్పేస్, రవాణా తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.
2019-20 యాసంగి ప్రణాళికపై హైదరాబాద్ హాకా భవన్‌లో అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌లు సమీక్షించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, కాళేశ్వరం నీటి వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతోందని మంత్రులు పేర్కొన్నారు. ధాన్యం నాణ్యత తెలుసుకునేందుకు... ప్రతి కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, విన్నోవింగ్ మెషీన్లు, టార్పాలిన్లు ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: ప్రతీ రైతు గడపకు పథకాలు చేరాలి: కేటీఆర్