ETV Bharat / state

పురపాలక ఎన్నికలకు సర్కార్‌ సన్నాహాలు

పురపాలక చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎన్నికల ఏర్పాట్లు, పలు పురపాలక సంఘాలపై హైకోర్టులో ఉన్న కేసులపై సీఎస్‌ ఎష్కే జోషి ఆదివారం సమీక్షించారు.

municipal
author img

By

Published : Jul 22, 2019, 6:47 AM IST

Updated : Jul 22, 2019, 7:21 AM IST

పురపాలక ఎన్నికలకు సర్కార్‌ సన్నాహాలు

పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. సీఎస్‌ ఎష్కే జోషి సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, పలు పురపాలక సంఘాలపై హైకోర్టులో ఉన్న కేసులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో విచారణకు రానుంది. సానుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో మున్సిపాల్టీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వెంటనే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశముంది.

తెలంగాణ కొత్త పురపాలక నిబంధనల చట్టం 2019కి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఈ చట్టం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చినట్లయింది. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్ట బిల్లుకు ఈ నెల 19న శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి.

ఇదీ చూడండి: నేడు చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటన

Intro:Body:Conclusion:
Last Updated : Jul 22, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.