ETV Bharat / state

తెదేపాలో ఇంతే.. రాజ్యసభకు పంపిస్తే అంతే..!! - రాజ్యసభ

పిలిచి పదవులు ఇవ్వడం.. తర్వాత వాళ్లు పార్టీని వదిలేసి వెళ్లడం.. తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీ ఇది...! పార్టీ పుట్టినప్పటి నుంచీ.. "పెద్దలు" ఎవ్వరూ తెదేపాలో నిలవలేదు. నాటి ఉపేంద్ర నుంచి నేటి వరకూ.. రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువ మంది పార్టీకి రాం.. రాం.. చెప్పిన వారే...!  తాజాగా నలుగురు ఎంపీల రాజీనామాతో.. పెద్దల సభలో పార్టీకి కలిసిరావడం లేదన్న విషయం మరోసారి చర్చకు వస్తోంది.

తెదేపాలో ఇంతేనా!
author img

By

Published : Jun 20, 2019, 7:34 PM IST

సార్వత్రిక ఎన్నికల ఓటమితో.. నీరసించిపోయిన తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు.. వేరు కుంపటి పెట్టారు. పార్టీ నుంచి దూరం జరిగారు. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించమంటూ.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ అందించారు. తెదేపా రాజ్యసభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ.. లేఖ ఇచ్చారు. తెలుగుదేశానికి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలుండగా.. కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే.. తెదేపాలోనే కొనసాగుతున్నారు.

ఒక్కసారే నలుగురు ఎంపీలు పార్టీని వీడిన అనూహ్య పరిస్థితుల్లో తెదేపా దిగ్భ్రాంతికి గురైంది. సార్వత్రిక ఎన్నికల ఓటమితో.. తెదేపా లక్ష్యంగా ఆపరేషన్ టీడీపీ మొదలవుతుందనే ఊహాగానాలు ఉన్నప్పటికీ.. ఒకేసారి నలుగురు బయటకు వెళ్లిపోతారని పార్టీ అంచనా వేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో.. తాజా పరిణామం తెదేపాకు ఓ రకంగా దారుణమైన దెబ్బే.

కలిసిరాని రాజ్యసభ

'పెద్ద'లెప్పుడూ.. తెదేపాకు అంత నమ్మకంగా లేరు. పిలిచి పదవులు ఇస్తే.. పార్టీని మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన వారే ఎక్కువ. పార్టీ తొలినాళ్ల నుంచీ ఇదే పరిస్థితి. తెలుగుదేశం ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించిన పర్వతనేని ఉపేంద్ర.. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో పార్టీని వీడిపోయారు. తాను వెళ్లడమే కాకుండా.. మరికొంతమంది ఎంపీలను తన వెంట తీసుకెళ్లి అప్పుడు మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.

ఇలా పదవి పొంది.. అలా వెళ్లి...

టీడీపీని వీడిన మరో నేత.. జయప్రద. సినీరంగం నుంచి నేరుగా రాజ్యసభలోకి వెళ్లిన నటి జయప్రద కూడా ఆ తర్వాత టీడీపీని విడిచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉన్న నటుడు మోహనబాబు ఎంపీ.. (రాజ్యసభ) అనిపించుకున్నారు. ఆ తర్వాత... పార్టీ అధినేత చంద్రబాబుతో విబేధించి.. బహిష్కరణకు గురయ్యారు. కడప జిల్లా నుంచి ముగ్గురు నేతలకు.. రెండు దఫాలు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తే.. ముగ్గురూ పార్టీని వదిలి వెళ్లిపోయారు.

ప్రాధాన్యత ఇచ్చినా...

పార్టీలో రాజ్యసభ కోసం.. విపరీతమైన పోటీ నెలకొని ఉన్న తరుణంలో చంద్రబాబు రెండు సార్లు.. సి. రామచంద్రయ్యకు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన పార్టీని వీడి అప్పట్లో ప్రజారాజ్యంలో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మైసూరారెడ్డికి చంద్రబాబు రెండుసార్లు అవకాశం కల్పించారు. ఆయన కూడా.. తెదేపాకు బైబై చెప్పి.. అప్పట్లో జై జగన్ అన్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదే జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సి.ఎం. రమేష్ కూ తెదేపా అధినేత రెండు సార్లు రాజ్యసభ అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడూ.. గుడ్ బై చెప్పేశారు.

కేంద్ర మంత్రిని చేసినా...

ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి.. బయటకు వెళ్లిపోయి మళ్లీ వచ్చిన టీజీ వెంకటేష్ కు.. పార్టీలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కాదని.. చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయనా వెళ్లిపోయారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వంతో పాటు.. కేంద్ర మంత్రిపదవి కూడా కల్పించిన తెదేపాను.. సుజనాచౌదరి వదిలేశారు. మొదటి నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా మెలిగిన గరికపాటి రామ్మోహనరావు సైతం పార్టీని వదిలారు. ఆయనకు పార్టీ రెండు సార్లు రాజ్యసభ అవకాశం కల్పించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వంగాగీత, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణి కూడా తెదేపాలో రాజ్యసభ సభ్యత్వం పొంది.. తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరొక పార్టీలోకి వెళ్లిపోయారు.

ఇంకెందరు?

ఈ కోవలో.. ఇంకెవరైనా తెదేపాను వీడనున్నారా? అన్నది రాష్ట్ర స్థాయిలోనే కాదు.. జాతీయంగానూ చర్చనీయాంశమైంది.

Intro:స్క్రిప్ట్ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం మాని రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేసి ఇ ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు గురువారం దానికి తెదేపా కార్యాలయంలో లో జరిగిన విలేకరుల సమావేశంలో లో ఆయన మాట్లాడారు కడప జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు జిల్లాలో లో నీటి కోసం అలా గ్రామాల్లో లో ప్రజలు మైళ్లకొద్దీ వెళ్లి నీరు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నీటి యుద్ధాలు తప్పవు అన్నారు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసే వారికి గిట్టుబాటు ధర లేక నీటిని తలప చేయలేకపోతున్నారని ట్యాంకర్ల అద్దెను ప్రభుత్వం పెంచాలన్నారు గత మార్చి ఏప్రిల్ మే నెలల్లో మీరు బ్యాంకర్లకు సత్వరమే బిల్లులు చెల్లింపు చేయాలని లేనిపక్షంలో నీటి సరఫరా లేక జన అవస్థలు పడతారు రాయచోటి నియోజవర్గంలో వర్షాభావంతో ఉద్యాన తోటలు నిలువునా ఎండిపోతున్నాయి వారిని కాపాడేందుకు ప్రభుత్వం వన్ రైతులకు ఆర్థిక చేయూత అందించాలని డిమాండ్ చేశారు పూర్తిగా గా కడప కరువు జిల్లాగా ప్రకటించి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు భాజపాలోకి వెళ్తున్నారు అన్న ప్రచారం వాస్తవం కాదన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు నాయకులు తమ పార్టీ అధ్యక్షుడు మాట్లాడి మరింత ముందుకు వెళ్లి ప్రజలకు సేవలందించాలని కోరారని మాజీ ఎమ్మెల్యే ఆ రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో లో మా ర్కెట్ కమిటీ అధ్యక్షుడు గాజుల ఖాదర్ భాషా జడ్పిటిసి నర్సారెడ్డి రాంప్రసాద్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఖాదర్ వలి తదితరులు పాల్గొన్నారు

Body:బైట్ శ్రీనివాస్ రెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు

Conclusion:బైట్ ఆ శ్రీనివాస్ రెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.