సికింద్రాబాద్ లోతుకుంట వద్ద ఉన్న లక్ష్మీ కళా మందిర్ థియేటర్లో టీమ్ సాయి ఆధ్వర్యంలో దాదాపు 120 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బాలానగర్ డీసీపీ పద్మజ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపల్, పోలీసు శాఖలతో సమన్వయమై టీం సాయి టాస్క్ ఫోర్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు.
కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తున్న సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో తల్లడిల్లుతున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. సిరిసిల్లలో రైతులు గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని దగ్ధం చేస్తుంటే కేటీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం