ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతోన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ - Teacher MLC elections in telangana 2023

MLC Teacher elections in Telangana 2023: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ జరగనుండగా.. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

Teacher MLC elections in telangana
Teacher MLC elections in telangana
author img

By

Published : Mar 13, 2023, 8:14 AM IST

Updated : Mar 13, 2023, 9:49 AM IST

MLC Teacher elections in Telangana 2023 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం ఓటర్లలో పురుషులు 15,472 మంది కాగా.. స్త్రీలు 14,246 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

137 పోలింగ్ స్టేషన్‌లలో మహబూబ్‌నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 14 పోలింగ్‌ స్టేషన్‌లు, వనపర్తి జిల్లాలో 7, జోగులాంబ గద్వాల జిల్లాలో 11, నారాయణపేట్ జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ జిల్లాలో 18, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 593 పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా.. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీవోలు, 137 మంది ఏపీవోలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. అందులో 146 మందిని రిజర్వ్‌గా నియమించారు. రిసెప్షన్ సెంటర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది సెక్ట్రోల్ అధికారులను నియమించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,822 మంది ఓటర్లు ఉండగా.. 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలోనూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇబ్రహీంపట్నంలో 207, మంచాలలో 62, యాచారంలో 85 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మరోవైపు.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఎన్నికలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 109వ కేంద్రంలో పోలింగ్ 7 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే ఉపాధ్యాయులు ఓట్లు వేయడానికి క్యూలో నిలబడి ఉన్నారు. పోలింగ్ సిబ్బంది సమయానికే వచ్చినప్పటికీ బ్యాలెట్ బాక్స్ సీలింగ్ వేయడంలో జరిగిన ఆలస్యం వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమై.. ప్రశాంతంగా సాగుతోంది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 333 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.

ఏపీలోనూ ప్రశాంతంగా పోలింగ్..: ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇవీ చూడండి..

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. నామినేషన్ల జోరు

ఎన్నికల వేళ.. రచ్చరచ్చ అవుతోన్న మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో..

Last Updated : Mar 13, 2023, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.