Teachers Fight For Spouse Transfers : భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్ ఫోరమ్ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయ దంపతులు చాలా మంది ధర్నాకు హాజరయ్యారు.
ఉపాధ్యాయ దంపతులు.. పిల్లలతో సహా కమిషనర్ కార్యాలయం రోడ్డుపై బైఠాయించారు. గాంధీ వేషధారణతో పిల్లలు.. గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు చేతపట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్కు(Traffic) అంతరాయం ఏర్పడటంతో పాటు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.
Spouse Teachers Against on GO 317 : ఈ క్రమంలో చిన్నారులపై సైతం పోలీసులు దారుణంగా ప్రవర్తించడంతో.. పిల్లలు, వారి తల్లిదండ్రులు విలపించారు. మరోపక్క కొంతమంది పోలీసులు చిన్నారులను చేరదీసి.. వారి తల్లిదండ్రులను లాక్కుంటూ వాహనాలలోకి ఎక్కించారు. ఈ తోపులాటలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం(State Government).. మరో 13జిల్లాల్లో ఆపేయడం న్యాయమా అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు.
'భార్యాభర్తలకు ఓకేచోట పోస్టింగ్ ఇవ్వకుంటే.. పిల్లల సంగతేంటి..?'
వేర్వేరు చోట్ల విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ పిల్లలను సరిగా చూసుకోలేకపోతున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు. జీవో నెం 317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ సమస్యల్ని పరిష్కరించాలని.. లేదంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
స్పౌస్ టీచర్ల బదిలీల విషయంలో రాష్ట్రంలో 19 జిల్లాలకే అమలు చేసి, మిగిలిన 13 జల్లాలను విస్మరించడం జరిగింది. ఈ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులను కూడా కలపాలని గత ఇరవై నెలలుగా గాంధీ మార్గంలోనే శాంతియుతంగా మా బాధను వెల్లబుచ్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి.. చివరి ప్రయత్నంగా మౌన దీక్ష చేపట్టాం. ఇప్పటికైనా మా బాధను అర్థంచేసుకుంటారని.. 19 జిల్లాల్లో ఏవిధంగా అయితే స్పౌస్ బదిలీలు చేపట్టారో మిగిలిన జిల్లాల్లో కూడా అదేవిధంగా బదిలీలు చేయాలని విన్నపించుకుంటున్నాం. :- బాధిత ఉపాధ్యాయురాలు
జీవో నెంబర్ 317 వెంటనే రద్దు చేయాలి.. ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస జీవో నెంబర్ 317 కు వ్యతిరేకంగా హైదరాబాద్లో శాంతియుత ర్యాలీ చేపట్టింది. నాంపల్లిలోని రైల్వేస్టేషన్ నుంచి అసెంబ్లీలోని(Assembly) గాంధీ విగ్రహం వరకు ఉపాధ్యాయులు ర్యాలీకి పిలుపునిచ్చారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అడ్డుకున్న పోలీసులు.. వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల కేటాయింపులు చేసేటప్పుడు స్థానికత అంశాన్ని విస్మరించారని ఉపాధ్యాయులు తెలిపారు.
జీవో 317, స్పౌజ్ బదిలీలపై టీచర్ల పోరుబాట
టీచర్స్ని తమ సొంత జిల్లాలను బలవంతంగా వదిలి ఇతర జిల్లాలకు శాశ్వతంగా పంపించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో స్థానికతకు చోటు లేకుండా పోయిందని మండిపడ్డారు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి(Mental Stress) గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబానికి దూరం అవుతున్నామని.. మా పిల్లలు భవిష్యత్తులో స్థానికత విషయంలో తీవ్ర అన్యాయం జరగబోతోందన్నారు.
Teachers Protest on GO 317 : ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని.. స్థానిక జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా 317 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్ న్యూమరి పోస్టులు సృష్టించి 317 బాధితులను స్థానిక జిల్లాకు పంపేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
GOVT TEACHERS PROTEST : ఇందిరాపార్క్వద్ద ఉపాధ్యాయ సంఘాల ధర్నా.. అరెస్ట్