పురపాలక సంఘాల్లో నూతన చట్టాన్ని తీసుకొచ్చి తెరాస రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా పనిచేసే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ కూడా తమ కనుసన్నుల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని రావుల ఆరోపించారు. సంక్రాంతి పండుగ పూట కుటుంబాల్లో అలజడి సృష్టించే విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీల గొంతునొక్కుతున్నారని రావుల మండిపడ్డారు.
ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్