ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెతెదేపా అధ్యక్షులు ఎల్.రమణ అన్నారు. ఇప్పటి వరకు తెజస, సీపీఐతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికల లెక్కింపు పూర్తయ్యాక తెదేపా తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో తెదేపా వందశాతం ఉంటుందని... దీనిపై ఎలాంటి అపోహాలు అవసరం లేవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ధనప్రభావం అనేది ముఖ్యం కాదని... నిన్నటి లోక్‌సభ ఎన్నికలే ఉదాహరణగా నిలిచాయని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమబ్బులు... పలు చోట్ల వర్షం