ETV Bharat / state

ఉంగుటూరులో ఉద్రిక్తత.. రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన - రైతు ఆత్మహత్య తాజా వార్తలు

Farmer Suicide: చెరువు నీళ్ల మళ్లింపు వివాదంలో రైతు ఆత్మహత్య చేసుకోవటంతో ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా ఉంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది. రైతు నందకిశోర్ మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు రహదారిపై తెదేపా నేతలు ఆందోళనకు దిగారు.

tdp-protest-for-farmer-suicide-in-ungutur
ఉంగుటూరులో ఉద్రిక్తత.. రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన
author img

By

Published : Aug 9, 2022, 8:44 PM IST

ఉంగుటూరులో ఉద్రిక్తత.. రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన

TDP Protest For Farmer Suicide: ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా ఉంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది. చెరువు నీళ్ల మళ్లింపు వివాదంలో ఆత్మహత్య చేసుకున్న రైతు నందకిశోర్ అంత్యక్రియల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వస్తున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, ఇతర నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జీజీహెచ్​ నుంచి మృతదేహాన్ని ఉంగటూరుకు తీసుకొస్తుండగా.. అంబులెన్స్‌ను తెదేపా నేతలు మధ్యలో అడ్డుకున్నారు. రైతు మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.