ETV Bharat / state

3 గంటల్లో బెడ్ ఎక్కడైనా ఇస్తున్నారా..?: చంద్రబాబు - ap news

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

చంద్రబాబునాయడు
ఏపీ వార్తలు
author img

By

Published : Apr 28, 2021, 1:57 PM IST

ఏపీ ప్రభుత్వ అసమర్థ చర్యలతో ప్రజలు చనిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్ రేటు 25.8 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులకు సైతం తప్పుడు లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు.

కరోనా ఉద్ధృతి కారణంగా ఏపీ ప్రజలను పొరుగు రాష్ట్రాలకు రానివ్వని దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెబుతున్నదంతా అబద్ధమన్నారు. ప్రభుత్వ జీవోలు ఎక్కడా అమలు కావటం లేదని.. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

మిగతా రాష్ట్రాల కంటే ముందే.. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు హరించి.. శ్మశానాలకు రాజులుగా ఉండాలని అనుకుంటున్నారా అని నిలదీశారు. వాస్తవాలు చెప్పే వారిపై కేసు పెడతామని బెదిరించటం తగదని హితవు పలికారు.

ఇదేమి పరిస్థితి

రాష్ట్రంలో కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ లేకుండా చేశారన్నారు. వైద్య సిబ్బందికి సైతం కనీస సౌకర్యాలు కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృదేహాలను మోటార్ సైకిల్​పై తీసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. 3 గంటల్లో బెడ్ ఇస్తామని ప్రకటించారు కానీ.. ఎక్కడైనా ఇస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వెంటిలేటర్ బెడ్​కు రూ. 10 వేలు వసూలు చేయాల్సి ఉంటే.. రూ లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆ చర్యల వల్లనే..

పాఠశాలలు తెరవటం వలనే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారని చంద్రబాబు అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రాణం ఉంటేనే చదువు, భవిష్యత్తు అనీ.. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఏం చర్యలు తీసుకుంటున్నారు

18 ఏళ్లకు పైబడిన వారికి టీకాపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ చేతకానితనంతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని దుయ్యబట్టారు. అందరినీ కలుపుకొని.. ప్రజల ప్రాణాలు కాపాడాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 8,061 కరోనా కేసులు, 56 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.