ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేేశాలకు తెదేపా అధినేత చంద్రబాబుతో సహా శాసనసభ్యులు నల్లచొక్కాలతో హాజరయ్యారు. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నల్ల చొక్కాలతోనే అసెంబ్లీకి వెళ్లనున్నట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు.
ఇదీ చదవండి: మాస్క్ లేకుండా బయటకు వస్తే.. జరిమానా కొరడా!