బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఆ వర్గానికి చెందిన ఎల్.రమణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపామని తెతెదేపా ప్రకటించింది. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
నిరుద్యోగ సమస్యలపై ఎమ్మెల్సీలుగా ఉన్న వారు గతంలో ఏనాడు మాట్లాడలేదని పార్టీ నేత దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఎల్.రమణకు ప్రజాప్రతినిధిగా ఎంతో అనుభవం ఉందని.. అందుకే ఎమ్మెల్సీ పోరులో నిలిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా వచ్చేందుకు ఎల్.రమణ కృషే కారణమని ఆయన గుర్తు చేశారు. మేధావులంతా రమణ విజయానికి కృషి చేయాలని కోరారు.
అన్ని రాజకీయ పార్టీలు ఒక ఆలోచనా విధానం లేకుండా గుడ్డిగా అభ్యర్థులను బరిలో నిలిపాయని మరో నాయకురాలు జ్యోత్స్న విమర్శించారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న రమణ.. మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పోరులో రమణను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా 4 ఏళ్లు.. అభివృద్ధి పనుల వివరణ