ETV Bharat / state

ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు: తెదేపా - రామతీర్థం ఘటనపై అచ్చెన్నాయుడు

ఏపీలో రామతీర్థం ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెదేపా నేతలు అన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు: తెదేపా

author img

By

Published : Jan 2, 2021, 7:58 PM IST

ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు: తెదేపా

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 124 ఆలయాల్లో దాడులు జరిగితే.. సీఎం జగన్​ ఏనాడూ స్పందించలేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరినీ పట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కొండపైన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు, అశోక్​ గజపతి రాజు.. ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఆలయాలపై దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. 19 నెలలుగా కులాలు, మతాల వారీగా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ఘటన జరిగిన 4 రోజులకు దేవుడు గుర్తుకొచ్చాడా అని వైకాపాను ప్రశ్నించారు. వైకాపా నేతలు చేస్తున్న పనులను.. తమ పార్టీ, నేతలకు ఆపాదిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలను దొంగకు అప్పగించారని అచ్చెన్న ఆరోపించారు.

జైలుకు వెళ్లివచ్చిన వారు నాయకులైతే ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. రామతీర్థం రాకుండా చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నారు. హిందూమతాన్ని గౌరవించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పాటించాలని కోరుతున్నా.- అశోక్‌గజపతిరాజు

ఇదీ చదవండి: రైతుబంధుతో రూ. 5,111 కోట్ల సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.