Yarapathineni comments on YCP leaders: పరదాల చాటున తిరిగే ఏపీ సీఎంను చూసి రెచ్చిపోతున్న వైకాపా నేతలు రేపటి పరిస్థితి ఏంటో గ్రహిస్తున్నారా అని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. పతనం అంచున ఉన్నారు కాబట్టే ఏం చేయాలో అర్థంకాక.. దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా నాయకులు పదేపదే పరుష పదజాలంతో దూషించడాన్ని.. ఆయన ఖండించారు. లోకేశ్ పట్ల భయంతోనే నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. లోకేశ్ అంటే ఆ మాత్రం భయం వైకాపా నేతల్లో ఉండాలన్నారు.
1989-1994 మధ్య జరిగిన అరాచకాల ఫలితం ఓ నిశబ్ద విప్లవమైందని ఎద్దేవా చేశారు. అదే నిశబ్ద విప్లవం తిరిగి పునరావృతం కానుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో,.. ఎవరిని ఎలా పాతరేయాలో అన్నింటికీ సిద్దపడి ఉన్నామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిపారు.
టీడీపీ నేతలపై పోలీస్ స్టేషన్లోనే దాడులు చేస్తుంటే.. డీజీపీ ఏసీ గదిలో కూర్చుని ఏమి చేస్తున్నాడని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన చివరి అవకాశాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేసుకుని చరిత్రహీనులవుతున్నారని విమర్శించారు. వైకాపాకు ప్రజలు శాశ్వత సమాధి కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. టీడీపీ ఓ పటిష్టమైన వ్యవస్థ,.. మీరు చేయగలిగేది ఏమీ లేదన్నారు. అహంకారంతో మాట్లాడే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లకు పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చదవండి: యాదాద్రి థర్మల్‌ప్లాంట్‌ను పరిశీలించిన కేసీఆర్... కాసేపట్లో సమీక్ష
'ప్రభుత్వ స్కూల్ బాలికలకు ఫ్రీగా సానిటరీ ప్యాడ్స్'.. ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు