ETV Bharat / state

'ఏపీ పరిషత్​ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సంతృప్తిగా లేదు' - mptc, zptc elections in andhrapradhesh

ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్​కు వెళ్తున్నట్లు తెదేపా నేత వర్ల రామయ్య తెలిపారు. ఆపార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

tdp polit bureau member
ap news, ap tdp, varla ramaiah
author img

By

Published : Apr 7, 2021, 7:07 PM IST

'ఏపీ పరిషత్​ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సంతృప్తిగా లేదు'

పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్​కు వెళ్తున్నట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేనందునే, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన జరిగిందనే విషయాన్ని వివరిస్తూ అప్పీల్​కు వెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళ్తుంటే చూస్తూ ఊరుకోమన్న వర్ల రామయ్య.. నోటిఫికేషన్​కు నాలుగు వారాల వ్యవధి ఉండాలనే నిబంధనను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలందరితో సమావేశం నిర్వహించిన అనంతరమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు వర్ల రామయ్య చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.