ETV Bharat / state

'నేపాల్​ క్యాసినోకి చాలామంది వెళ్లారు.. ఆ జాబితా ప్రభుత్వం బయటపెట్టగలదా?' - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

TDP LEADER VARLA: ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అలాగే నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారని.. అందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని ఆరోపించారు.

tdp leader varla Ramaiah on chikoti Praveen casino

author img

By

Published : Jul 28, 2022, 5:30 PM IST

TDP LEADER VARLA: సంక్రాంతి సందర్భంగా ఏపీలోని గుడివాడలో కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. చికోటి ప్రవీణ్ నేపాల్​లో నిర్వహించిన క్యాసినోలో వేల కోట్ల రూపాయల హవాలా ధనం చేతులు మారినట్లు ఈడీ గుర్తించి సోదాలు జరిపిందన్నారు. నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారని.. అందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని ఆరోపించారు.

ఒక్కొక్కరి నుంచి ప్రవీణ్ రూ.3లక్షలు వసూలు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఏపీ నుంచి నేపాల్​ క్యాసినోకి వెళ్లిన వారి జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యాసినోలో వైకాపా నేతలు బ్లాక్ మనినీ.. వైట్ మనీగా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

'నేపాల్​ క్యాసినోకి చాలామంది వెళ్లారు.. ఆ జాబితా ప్రభుత్వం బయటపెట్టగలదా?'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.