ఏపీ సీఎం జగన్... సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్లో ఉందో అర్థం అవుతోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకోవటం కాకుండా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని లోకేష్ నిలదీశారు.
'తరలిపోతున్న సొమ్మును పట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా?' - నారా లోకేష్ తాజా వార్తలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్... సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంత్రి బాలినేనికి సంబంధించి తమిళ మీడియాలో వచ్చిన కథనాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఏపీ సీఎం జగన్... సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్లో ఉందో అర్థం అవుతోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకోవటం కాకుండా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని లోకేష్ నిలదీశారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'