TDP Contest 119 Seats In Telangana Assembly Elections : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరోసారి తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన మేడ్చల్ పార్లమెంటరీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.. నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని.. ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా గుర్తింపు ఉన్న మల్కాజ్‌గిరిలో రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని భయపడి టీఆర్ఎస్ నాయకులు తరచు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అని ప్రచారాలు చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు అంతట ఉన్నారని వారిని మేల్కొలిపి ఓటు వేసేందుకు నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ లేదని అన్న పార్టీలకు ఈ ఎన్నికలే గుణపాఠం కావాలని కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు.
40 శాతం టికెట్లు యువతకే.. టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం
"మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వందనాలు. టీడీపీ బస్సు యాత్ర కంటే ముందు మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో సభ ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా రాబోయే ఎన్నికలో కూడా 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేయబోతుంది. గతంలో కూడా నేను చెప్పాను బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ల సీట్లను ప్రకటిస్తాయని అన్నారు. తామే గెలుస్తామని వాళ్లలోనే వాళ్లే పాచికలు వేసుకుంటున్నారు. తెలుగుదేశం క్లియర్‌గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి 39 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ఉన్నారు." - కాసాని జ్ఞానేశ్వర్
"ప్రజలు ఆర్భాటంలో లేరు.. ఈసారి ఓట్లు ఎవరికి వేయాలనే దానిపై ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. క్రమశిక్షణ గల పార్టీ ఏది.. అభివృద్ధి చేసిన పార్టీ ఏది అని.. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన పనులు ఏమిటని గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా ఇచ్చారు. చంద్రబాబునాయుడు మున్సిపాలిటీలను బలోపేతం చేశారు. ఎన్టీఆర్ చెక్‌డ్యాంలు నిర్మించారు. కావున తెలుగుదేశం మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందని" కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు.
chandrababu in Deep tech: P4 విధానంతో భారత్‌లో పేదరిక నిర్మూలన.. డీప్ టెక్నాలజీ సదస్సులో చంద్రబాబు
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షునిగా అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాసాని జ్ఞానేశ్వర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులు 100 రోజుల ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయి, వార్డు స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఒక్కరు ఓటరును ఓటు వేసేందుకు తీసుకువచ్చే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
"NTR చేసిన అభివృద్ధిని చంద్రబాబు గుర్తు చేస్తే BRS ఉలిక్కిపడుతోంది"
తెలంగాణ తెదేపాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలి: చంద్రబాబు