ETV Bharat / state

పెద్దిరెడ్డి పనైపోయింది.. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం: చంద్రబాబు - పీలేరులో చంద్రబాబు పర్యటన

CBN FIRES ON YSRCP GOVERNMENT : టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. పీలేరు సబ్‌ జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఏం తప్పు చేశారని కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jan 16, 2023, 5:27 PM IST

పెద్దిరెడ్డి పనైపోయింది.. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం: చంద్రబాబు

CBN FIRES ON YSRCP GOVERNMENT : ఏం తప్పులు చేశారని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ ​జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా అంటూ మండిపడ్డారు. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా అని నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలపై సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహించారు. ఎంతమందిని జైల్లో పెడతారో తామూ చూస్తామన్నారు. భయపెట్టి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని ఆరోపించారు. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

"ఏం తప్పు చేశారని మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా? తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారు. భయపెట్టి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. నన్ను పీలేరు రాకుండా అడ్డుకుంటారా? నేనెక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా? ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోండి. పెద్దిరెడ్డి పనైపోయింది. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు"-చంద్రబాబు

టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులా అని చంద్రబాబు నిలదీశారు. భయపెట్టి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా అని ప్రశ్నించారు. పండుగ జరుపుకోకుండా జైల్లో పెడతారా అని ప్రశ్నించిన చంద్రబాబు.. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి పనైపోయిందని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాబు తెలిపారు. తమ పార్టీ నేతలను ఇబ్బందిపెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

సబ్‌ జైలు వద్ద ఆందోళన: అన్యాయంగా తమ వారిపై కేసులు పెట్టారని పీలేరులో మహిళలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీల గొడవలో తమ వారికి సంబంధం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం కేసులు పెట్టి తమవారిని వేధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పీలేరు సబ్‌ జైలు వద్ద చంద్రబాబుతో మాట్లాడుతుండగా.. పర్వీన్‌ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

టీడీపీ సౌండ్​ బాక్స్​ వాహనం సీజ్​: అంతకుముందు పీలేరులో చంద్రబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. టీడీపీకి సంబంధించిన సౌండ్‌ బాక్స్‌ల వాహనాన్ని సీజ్‌ చేశారు. చంద్రబాబు సౌండ్‌ వెహికిల్‌కు అనుమతి లేదని అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.