ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు భేష్​ - money

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ఆదాయపు పన్ను చెల్లింపు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 63.5శాతం ఆదాయపు పన్నురాబడులు పెరగ్గా... హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో మాత్రం 82.73 శాతం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో రూ.70,573 కోట్ల పన్ను వసూలు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీడీబీటీ లక్ష్యంగా నిర్దేశించింది.

తెలుగు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు భేష్​
author img

By

Published : Aug 12, 2019, 5:09 AM IST

Updated : Aug 12, 2019, 6:50 AM IST

తెలుగు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు భేష్​

తెలుగు రాష్ట్రాల రీజియన్‌లో యాభైలక్షల మందికిపైగా పన్నుచెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.31వేల 762 కోట్ల పన్నులు హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో వసూలయ్యాయి. 2017-18లో రూ.49 వేల 775 కోట్లు వసూలు కాగా... 2018-19లో రూ.60వేల 485 కోట్లు వసూలు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు లక్ష్యంగా పెట్టగా రూ.58 వేల 040 కోట్లు వసూలైంది. 2014-15తో పోలిస్తే 2018-19లో 82.73శాతం పన్నుల వసూళ్లు పెరిగాయి. జాతీయ పెరుగుదల సగటు 63.5శాతం కంటే ఇది ఎక్కువ.

నాలుగు నెలల్లోరూ.14 వేల 868 కోట్లు

2019-20 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లో ఇప్పటికే రూ.14 వేల 868 కోట్ల మేర ఆదాయపు పన్ను వసూలైనట్లు హైదరాబాద్‌ రీజియన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎన్‌.శంకరన్‌ తెలిపారు. ఈ నెలాఖరులోగా రిటర్న్‌లు దాఖలు చేయకుండా....ఆ తరువాత చేసే వారు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

8 నుంచి పది లక్షల మంది

యేటా 8 నుంచి పది లక్షల మంది కొత్తగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లు ఫైల్‌ చేస్తారని భావిస్తున్నారు. ఈ నెల చివర వరకు గడువు పొడిగించడం వల్ల ఎక్కువ మంది రిటర్న్‌లు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నారు.

సంస్థలపై దాడులు

వచ్చే నెల మొదటి వారంలో ఎంత మంది రిటర్న్‌లు ఫైల్‌ చేస్తారన్న విషయం తెలుస్తుందని ఆదాయపుపన్ను అధికారులు తెలిపారు. పన్ను ఎగవేతదారులకు సంబంధించి... రకరకాల విధానాల్లో పన్ను ఎగవేతదారులకు చెందిన సమాచారం తమకు వస్తోందని...దాని ఆధారంగా తాము సంబంధిత సంస్థలపై దాడులు నిర్వహిస్తామని డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.కె.పలివాల్‌ చెప్పారు.

ఆరింటిలో ఒకటిగా

మొత్తం 18 రీజియన్లల్లో హైదరాబాద్ మొదటి ఆరింటిలో ఒకటిగా ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ప్రైవేటు, ప్రభుత్వం రంగ సంస్థలు వారి ఉద్యోగుల నుంచి ఏ నెలకు ఆ నెల టీడీఎస్‌ మినహాయించుకుని మిగిలిన మొత్తాలను మాత్రమే వేతనాల కింద ఉద్యోగులకు ఇస్తున్నారు. ఇందుకు తోడు...ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తుంటేనే గృహ, వ్యాపార లాంటి రుణాలు ఇస్తుండడం వల్ల కొత్త ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాన్‌ కార్డులు కలిగిన వారు కోటి మందికిపైగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటే వాటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించాలని.. లేకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు.

ఇదీ చూడండి: సాగర్​కు పెరిగిన వరద ఉద్ధృతి

Last Updated : Aug 12, 2019, 6:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.