ETV Bharat / state

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న వ్యాట్‌, జీఎస్టీ రాబడులు - tax

తెలంగాణ రాష్ట్రంలో జులై నెలలో జీఎస్టీ, వ్యాట్‌ రాబడులు రూ.3,786 కోట్లు వచ్చాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపులు తర్వాత వ్యాపార, వాణిజ్య లావాదేవీలు పుంజుకోవడం వల్ల రాబడులు కూడా పెరిగాయి. గడిచిన మూడు నెలలతో పోలిస్తే జులై నెలలో పెట్రోల్, మద్యంపై వ్యాట్ వసూళ్లతోపాటు జీఎస్టీ రాబడులు కూడా మెరుగ్గా ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది.

tax-collections-increased-in-telangana
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న వ్యాట్‌, జీఎస్టీ రాబడులు
author img

By

Published : Aug 7, 2020, 5:01 AM IST

కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనాకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే అవకాశాలు లేకపోవడం వల్ల ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ కార్యకలాపాలల్లో కొనసాగక తప్పడం లేదు. భయపడుతూనే సాధారణ జీవనం సాగించే దిశలో ప్రజలు ముందుకెళ్లుతున్నారు. మార్చి 24 నుంచి పూర్తిగా స్తంభించిన వ్యాపార, వాణిజ్య సంస్థల లావాదేవీలు... జూన్, జులై నెలల్లో దాదాపు సాధారణ స్థితిలోకి వచ్చాయి. దీంతో వస్తు సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను రెండూ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మద్యం విక్రయాలు భారీ ఎత్తున జరగడం వల్ల విలువ ఆధారిత పన్నులు కూడా ఎక్కువ వచ్చాయి.

మద్యం విక్రయాలపై మెరుగ్గా వసూళ్లు

జులై నెలలో పెట్రోల్ అమ్మకాలపై వచ్చిన వ్యాట్ రూ.806 కోట్లు కాగా గత ఏడాది జూలైతో పోలిస్తే 9 శాతం తగ్గింది. మద్యం విక్రయాలపై విలువ ఆధారిత పన్ను రూ.1050 కోట్లు వసూళ్లు అయ్యి గత సంవత్సరం జులై రాబడితో పోలిస్తే 17 శాతం అధికంగా వచ్చింది. ఇతరత్రా రాబడులు రూ.55.33కోట్లు అయ్యాయి. జులై నెలలో వస్తు సేవల పన్ను వసూళ్లను పరిశీలిస్తే రాష్ట్ర జీఎస్టీ కింద రాబడి రూ.923.49 కోట్లు, ఐజీఎస్టీ వసూళ్లు రూ. 950.54 కోట్లు రాగా...…జులై నెలలో వ్యాట్, జీఎస్టీ రాబడులు మొత్తం రూ.3,786 కోట్లు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో ఏప్రిల్ నుంచి జులై వరకు నాలుగు నెలల్లో రూ.8458 కోట్లు జీఎస్టీ రాబడులు రాగా ఈ ఏడాది రూ 5079.26 కోట్లు వచ్చి 40శాతం తగ్గినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.

క్రమంగా పెరుగుతున్న రాబడులు

వ్యాట్‌, జీఎస్టీ రాబడులను పరిశీలిస్తే 2019లో 14వేల 780 కోట్లు ఆదాయం రాగా.. 2020 లో 32 శాతం తగ్గి 10వేల62.63 కోట్లు వచ్చాయని వాణిజ్య పన్నుల శాఖ పేర్కొంది.

ఇవీ చూడండి: వీలైనంత ఎక్కువ రుణాలు ఇప్పించాలి: సీఎస్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.