ETV Bharat / state

ఈనెలలో రాబడి పెరిగే అవకాశం... ఎందుకంటే? - GST

రాష్ట్రంలో జీఎస్టీ, వ్యాట్​ రాబడులు.. ఈనెలలో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య లావాదేవీలు పుంజుకుంటున్నాయి. ఫలితంగా సాధారణ రాబడుల్లో 60 నుంచి 70శాతం వరకు వచ్చేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో మొత్తం రాబడులు 932 కోట్లుగా వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది.

Tax Collections Increase in may month
ఈనెలలో రాబడి పెరిగే అవకాశం... ఎందుకంటే?
author img

By

Published : May 28, 2020, 2:52 PM IST

లాక్‌డౌన్‌ నిబంధనల్లో ఒక్కొక్కటిగా సడలింపులు వస్తుండడం వల్ల.. ప్రజలు తిరిగి సాధారణ జీవనం సాగిస్తున్నారు. మే 24 నుంచి పూర్తిగా స్తంభించిన వ్యాపార, వాణిజ్య సంస్థల లావాదేవీలు.. లాక్‌డౌన్‌ సడలింపుతో క్రమంగా పుంజుకుంటున్నాయి. దీనితో వస్తు సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను రెండూ కూడా క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కాకపోయినా 60శాతానికిపైగా వ్యాట్‌, జిఎస్టీ రాబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

పూర్తిస్థాయిలో రాబడులు రావాలంటే మరో రెండు, మూడు నెలలైనా పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి తమ కార్యకలాపాలు సాగించే వరకు వ్యాపార సంస్థలు పూర్తిస్థాయిలో వ్యాపారం చేయలేవని అభిప్రాయపడుతున్నారు.

ఏప్రిల్‌ నెలలో రాబడులు భారీగా పడిపోయి వ్యాట్‌, జీఎస్టీ రెండూ కలిపి వచ్చింది కేవలం 932 కోట్ల 53లక్షలు మాత్రమేనని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో పెట్రోల్‌ విక్రయాల వల్ల దాదాపు 700 నుంచి 750 కోట్ల రాబడి రావాల్సి ఉండగా.. 73శాతం ఆదాయం తగ్గి కేవలం 181 కోట్లు మాత్రమే వచ్చింది.

మద్యం విక్రయాల వల్ల దాదాపు ఏడు వందల కోట్లు ఆర్జించాలి. పైసా కూడా రాలేదు. గత ఏడాది ఏప్రిల్‌ లో వస్తు సేవల పన్ను కింద 3వేల 728 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో లాక్‌డౌన్‌ కారణంగా వచ్చిన రాబడి 751 కోట్ల 54 లక్షలు మాత్రమే. మొత్తం కలిపి రాబడి దాదాపు రూ.933 కోట్లుగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌ సడలింపుతో వాహన రాకపోకలు ఎక్కువవుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మే నెలలో అయిదు వందల కోట్లకుపైగా రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక మద్యం విక్రయాలు ఆరో తేదీ నుంచి తెరవడం వల్ల.. భారీ ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. రాబడి అంచనాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.