ETV Bharat / state

విమాన రంగానికి తెలంగాణ రెక్కలు

author img

By

Published : Feb 6, 2021, 6:47 AM IST

ఎయిరోస్పేస్​ హబ్​గా తెలంగాణ మారుతోంది. బోయింగ్‌-737 విడిభాగాల తయారీ హైదరాబాద్​లో జరగనుంది. సైనిక రవాణా విమానాల ప్రాజెక్టుపైనా రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. కేంద్రం వద్ద టాటా-ఎయిర్‌బస్‌ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అవి ఆమోదం పొందితే వాటి తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా మారవచ్చని భావిస్తున్నారు.

విమాన రంగానికి తెలంగాణ రెక్కలు
విమాన రంగానికి తెలంగాణ రెక్కలు

విమానయాన రంగ పరిశ్రమలకు తెలంగాణ రెక్కలు తొడుగుతోంది! బోయింగ్‌-737 విమానాల తయారీలో వినియోగించే కీలకమైన 'వర్టికల్‌ ఫిన్‌ స్ట్రక్చర్ల' హైదరాబాద్‌లో తయారు కాబోతున్నాయి. మరోవైపు సైన్యం కోసం తేలికపాటి రవాణా విమానాల తయారీ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అవి ఆమోదం పొందితే వాటి తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా మారవచ్చని భావిస్తున్నారు. బోయింగ్‌ విమానాల 'వర్టికల్‌ ఫిన్‌ స్ట్రక్చర్ల' తయారీకి హైదరాబాద్‌ ఆదిభట్లలో బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టాటా గ్రూపు సంస్థ) సంయుక్త కంపెనీ అయిన టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ (టీబీఏఎల్‌) యూనిట్లో ఒక కొత్త ‘ప్రొడక్షన్‌ లైన్‌’ ఏర్పాటు చేయనున్నట్లు బోయింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఇక్కడ బోయింగ్‌ ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్‌ ఏరో-స్రక్చర్లు, సెకండరీ స్ట్రక్చర్లు, ఫ్యూస్‌లేజెస్‌, వెర్టికల్‌ స్పర్‌ బాక్సులు, ఇతర ముఖ్య విడిభాగాలు తయారు చేస్తున్నారు. కొత్తగా టీబీఏఎల్‌లో ఏర్పాటు చేసే ‘ప్రొడక్షన్‌ లైన్‌’ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. బోయింగ్‌ ఇండియాలో దాదాపు 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా దాదాపు 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7400 కోట్ల) విలువైన విడిభాగాలను మనదేశం నుంచి బోయింగ్‌ సమీకరిస్తోంది.

వర్టికల్‌ ఫిన్‌ స్ట్రక్చర్లు
ఎయిరో స్పేస్​ హబ్​గాతెలంగాణ

కీలక ముందడుగు

‘‘మనదేశంలో విమాన తయారీ, రక్షణ ఉత్పత్తి రంగాలకు సంబంధించి ఇదొక కీలకమైన ముందడుగు. రక్షణ పరికరాల తయారీకి ఇప్పటికే తెలంగాణ కేంద్ర స్థానంగా ఉంది. నిపుణులైన మానవ వనరుల లభ్యత, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉండటం దీనికి ప్రధాన కారణాలు. బోయింగ్‌, టాటా గ్రూపులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.’’

- కేటీఆర్​, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

రక్షణ, విమాన తయారీని విస్తరిస్తున్నాం

రక్షణ, విమాన తయారీ కార్యకలాపాలను భారతదేశంలో విస్తరించడానికి బోయింగ్‌ కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనం. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమంలో మేం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. సులువుగా వ్యాపార నిర్వహణకు వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోంది. విమాన, రక్షణ రంగాలకు అవసరమైన కీలక విడిభాగాలు ఇక్కడ తయారు చేస్తాం. - సలీల్‌ గుప్తా, బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు

బోయింగ్‌తో బలమైన భాగస్వామ్యం

బోయింగ్‌తో మా భాగస్వామ్యం బలపడుతోంది. బోయింగ్‌ 737 విమానాల్లో వినియోగించే వర్టికల్‌ ఫిన్‌ స్ట్రక్చర్స్‌ తయారీకి కొత్త సదుపాయాన్ని ప్రారంభించాలనే నిర్ణయం ఈ కోవలోనిదే. రక్షణ తయారీలో మనదేశం సొంతంగా ఎదగాలనే లక్ష్యానికి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌) కట్టుబడి ఉంది. - సుకరన్‌సింగ్‌, ఎండీ అండ్‌ సీఈఓ, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌

  • సైనిక రవాణా విమానాల ప్రాజెక్టుపైనా ఆశలు
  • రూ. 15,000 కోట్ల పెట్టుబడి
  • 2,500 మందికి ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న రూ. 15 వేల కోట్ల తేలికపాటి సైనిక రవాణా విమానాల తయారీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. దీనికి అనుమతి లభిస్తే టాటా-ఎయిర్‌బస్‌ కంపెనీలు తమ తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్‌బస్‌ ఇప్పటికే టాటాల సహకారంతో సి-295 సైనిక రవాణా విమానాన్ని తయారు చేసి బెంగళూరులోని వైమానిక ప్రదర్శనలో ప్రదర్శించింది. ఇలాంటి పరిమాణంలో సైనిక రవాణా విమానాన్ని నిర్మించడం ఇదే మొదటిసారి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విమానాల కోసం వివిధ సంస్థల నుంచి దరఖాస్తులను కోరింది. దానికి టాటా-ఎయిర్‌బస్‌ ఉమ్మడిగా ప్రతిపాదనను సమర్పించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) ఆమోదం పొందితే దేశీయంగా టాటా సంస్థ ఎయిర్‌బస్‌తో కలిసి వీటిని తయారు చేయడానికి మార్గం సుగమమవుతుంది. దీని ద్వారా రూ. 15,000 కోట్ల పెట్టుబడితో పాటు 2,500 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ఈ భారీ ప్రాజెక్టు హైదరాబాద్‌కు దక్కితే దేశీయ వైమానిక తయారీ రంగంలో అతిపెద్ద ప్రాజెక్టును పొందిన ఘనత లభిస్తుంది. దీంతో పాటు దేశీయ సైనిక విమానాల తయారీ కేంద్రంగా మారుతుంది.

లాక్‌హీడ్‌ మార్టిన్‌తో టాటా జట్టు

మరోవైపు భారత నౌకాదళానికి హెలికాప్టర్లు అందించే లక్ష్యంతో అమెరికా సంస్థ అయిన లాక్‌హీడ్‌ మార్టిన్‌, హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టీఏఎస్‌ఎల్‌తో జట్టుకట్టింది. తన అవసరాలకు అనువైన హెలికాప్టర్ల కొనుగోలుయత్నాల్లో భారత నౌకాదళం నిమగ్నమైంది. దీనికి లాక్‌హీడ్‌ మార్టిన్‌, టీఏఎస్‌ఎల్‌ సిద్ధమవుతున్నాయి. బెంగళూరులో ఏరో ఇండియా -2021 సందర్భంగా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఉపాధ్యక్షుడు బిల్‌ బ్లెయిర్‌, టీఏఎస్‌ఎల్‌ ఎండీ అండ్‌ సీఈఓ సుకరన్‌ సింగ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.