Tarunchug angry with CM KCR: కేసీఆర్ అహంకారం హింసా ప్రవృత్తిగా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. శామీర్‌పేటలో జరుగుతున్న పార్టీ మూడు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ 3రోజుల శిక్షణలో తెలంగాణ ముఖ్యనేతలు పాల్గొంటారని తెలిపారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో వివిధ అంశాలపై చర్చిస్తామన్నారు. అదే విధంగా రాష్ట్ర తాజా రాజకీయాలు...పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చిస్తామని వివరించారు.
ఇవీ చదవండి: