ETV Bharat / state

'కేసీఆర్‌కు ప్రధాని కావాలనే మోజు.. అందుకే ఈ డ్రామా' - Tarun Chug on mlas poaching issue

Tarun Chug on CM KCR Comments: సీఎం కేసీఆర్​కు ప్రధాని కావాలనే మోజు పెరిగిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్ పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై విపరీత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారని ఆరోపించారు.

Tarun Chug on CM KCR Comments
Tarun Chug on CM KCR Comments
author img

By

Published : Nov 4, 2022, 12:28 PM IST

Tarun Chug on CM KCR Comments: సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని.. తన పార్టీ గురించి కలలోనూ కంగారు పడుతున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్​చుగ్​ విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారని ఆరోపించారు. భాజపాకు సంబంధం లేదని యాదాద్రిలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారని.. తెరాస నేతలు నిజాయతీగా ఉంటే ప్రమాణం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు విశ్వాసం లేదన్నారు.

ఈ క్రమంలోనే తన పార్టీ గురించి కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారని తరుణ్​ చుగ్​ విమర్శించారు. తన పాపాల గురించి.. ప్రజల గురించి భయాందోళన చెందుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ సర్కారు పాపాలకు.. ప్రజలు తప్పకుండా బదులిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ విపరీత విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. కేసీఆర్‌కు ప్రధాని కావాలనే మోజు పెరిగిందని, దేశ ప్రజలు మోదీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు తెరాస పాలన నుంచి విముక్తి కావాలని కోరుతున్నారని స్పష్టం చేశారు.

"కేసీఆర్‌.. తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారు. తన పార్టీ గురించి ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌ తన ఫామ్​హౌజ్​లో సినిమా కథ అల్లారు. భాజపాకు సంబంధం లేదని యాదాద్రిలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారు. తెరాస నేతలు నిజాయతీగా ఉంటే ప్రమాణం ఎందుకు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ విపరీత విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌కు ప్రధాని కావాలనే మోజు పెరిగింది. తెలంగాణ ప్రజలు తెరాస పాలన నుంచి విముక్తి కావాలని కోరుతున్నారు." - తరుణ్​చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ​

ఇవీ చూడండి..

ఫామ్​హౌజ్​ సీఎం.. పాత ముచ్చటను పదే పదే చెప్పారు: కిషన్​రెడ్డి

దిల్లీలో తీవ్రస్థాయికి కాలుష్యం​.. స్కూళ్లకు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.