నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబల్ ఛైర్మన్ డాక్టర్ నంద కుమార్ సాయి తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రేపటి నుంచి 3రోజుల పాటు సాగనుంది. ముందుగా మహబూబ్నగర్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 30న హైదరాబాద్లో గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి...తగు సూచనలు చేస్తారు. 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన సంఘాల నేతలతో భేటీ అవుతారు.
ఇవీ చూడండి:పైస లేనిదే పని జరగడం లేదు