ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య 36వ వర్ధంతిని కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. లుంబినీ పార్కులోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
అంచెలంచులుగా ఎదిగిన అంజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తన సహయంతో ఎన్నో పథకాలను సంస్కరణలు తీసుకువచ్చారని.. అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడ్డ మహానాయకుడని కొనియాడారు.
ఇవీ చదవండి: