తమ ప్రాణాలకు, కుటుంబాలకు ముప్పు అని తెలిసినా... కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఆశావర్కర్లు, అంగన్వాడీలు, ఔట్సోర్సింగ్ సిబ్బందిపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు సీఎంకు లేఖను రాశారు.
ఆశావర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. కరోనా సోకిన నాటి నుంచి టెస్టులు, మందులు, వ్యాక్సినేషన్, కరోనా పేషెంట్స్ను ప్రతిరోజూ మానిటరింగ్ చేయడం లాంటి అన్ని విధులు వారు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడు వారిసేవలను కొనియాడుతుందని... కానీ వారికి అదనంగా సహాయం అందించడంలో మాత్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్