ప్రధానితో.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రాజెక్టు మంజూరుకు చర్యలు తీసుకోకుండా.. తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదని హితవు పలికారు.
గత యూపీఏ ప్రభుత్వం.. హైదరాబాద్, బెంగళూరులో ఐటీఐఆర్‌ను ప్రకటించిందని తమ్మినేని గుర్తు చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక.. అమలుకు పూనుకోకుండా ప్రాజెక్టును నిలిపివేసిందని మండిపడ్డారు.
ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తే.. వందలాది ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించేదన్నారు తమ్మినేని. రాష్ట్ర విభజన హామీలు సాధించడంలో.. తెలంగాణ భాజపా ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
ఇదీ చదవండి: మేం నాస్తికులం కాదు: సీపీఐ నారాయణ