ETV Bharat / state

సాలార్​జంగ్​ మ్యూజియంలో రెండు కొత్త గ్యాలరీలను ప్రారంభించిన గవర్నర్​..తమిళసై - Governer Open Two Galleries

Governer Open Two Galleries At Salarjung Museum: సాలార్​జంగ్​ ​మ్యూజియంలో ఏర్పాటు చేసిన రెండు కొత్త గ్యాలరీలను ఈరోజు గవర్నర్ తమిళసై సౌందరరాజన్​ ప్రారంభించారు. ఈ ఆర్ట్​ గ్యాలరీలో దక్షిణ భారతదేశానికి చెందిన వస్తువులను ప్రదర్శనకు ఉంచినట్లు బోర్డు సభ్యులు తెలిపారు.

సాలార్​జంగ్​ మ్యూజియంలో రెండు కొత్త గ్యాలరీలను ప్రారంభించిన గవర్నర్​...తమిళసై

author img

By

Published : Oct 29, 2022, 10:39 PM IST

Governer At Salarjung Museum: సాలార్​జంగ్​ మ్యూజియం బోర్డు ఛైర్​పర్సన్​గా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. సాలార్​జంగ్​ మ్యూజియంలో రెండు గ్యాలరీలను ప్రారంభించారు. 1968లో సాలార్​జంగ్​ మ్యూజియం కింది ఫ్లోరులో ప్రారంభించిన బ్రాంజ్, దక్షిణ భారత గ్యాలరీలను.. సాలార్ జంగ్ మ్యూజియం బోర్డు సభ్యులు, జితేందర్ కరాపే, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నవాబ్ అహ్థెరమ్ అలీఖాన్ తదితరుల సమక్షంలో.. ఈ రోజు ఉదయం పునః ప్రారంభించారు.

గంధంతో చేసిన దేవుళ్లు, దేవతల చిత్రాల గొప్ప సేకరణ, రోజ్‌వుడ్ ఫర్నీచర్, ఇత్తడి ఫలకాలతో అందంగా చెక్కిన క్యాబినెట్‌లు, క్లాక్ కేస్‌లు వంటివి ఈ దక్షిణ భారత మైనర్ ఆర్ట్ గ్యాలరీలో లభించనున్నట్లు సాలార్​జంగ్​ మ్యూజియం బోర్డు సభ్యులు తెలిపారు. కంచు పని అభివృద్ధి చెందిన 9 నుంచి 13వ శతాబ్దాల చోళుల కాలంలో, విజయనగర రాజుల పాలనలో బాగా కొనసాగింది. 14వ శతాబ్దానికి చెందిన విజయనగర కాలం నాటి నటరాజుని నాలుగు అడుగుల ఎత్తైన చిత్రం కూడా కంచు గ్యాలరీలో ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.