Talasani Srinivas Yadav Latest Comments on Congress Declaration : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో 12 అంశాలతో విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ నాయకుల విమర్శలు వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani) ఆ అంశంపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ చేసే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివని.. మంత్రి తెలిపారు. గోశామహల్లో బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పంపిణీతో పాటు.. పలు అభివృద్ధి పనులను.. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓట్లను దండుకొనే లక్ష్యంతో అవగాహన లేకుండా హామీలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపెట్టాలని.. అలాగే 50 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు.
"కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎవ్వరు నమ్మేవారు లేరు. ఎందుకంటే కొత్త పార్టీ అంటే వారు మనుగడకి హామీలు నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు. కాంగ్రెస్ రైతాంగానికి రైతు బంధు, రైతుబీమా ఇవ్వలేదు. కరెంట్, నీళ్లు సరిగ్గా అందించ లేదు. ఏదో ఎన్నికల్లో గెలవాలనే.. డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ కాదు."-తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
Comments on Congress SC, ST Declaration : ఆగస్ట్ 26న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణలోని ఆయా పార్టీల నాయకుల సమక్షంలో 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించి.. పలు ఆరోపణలు చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదకన కాంగ్రెస్‌ది డిక్షరేషన్(Congress Declaration) సభ కాదు.. అధికారం రాదనే ఫ్రస్ట్రేషన్ సభని ట్వీట్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హస్తం పార్టీవన్ని ఉత్తితి డిక్లరేషన్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకులకి తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. తరువాత రోజు నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
.
Congress Protest Against BRS : 'వచ్చేది మేమే.. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చేది మేమే'
BRS fires on Congress : 'కాంగ్రెస్ నేతలు బీసీలను కించపరుస్తున్నారు'