ETV Bharat / state

తలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​ - తెరాస

తలసాని కుమారుడు తెరాస సికింద్రాబాద్​ పార్లమెంటు అభ్యర్థి సాయికిరణ్ నామినేషన్ వేసేందుకు హైదరాబాద్​ కలెక్టరేట్​కు తెరాస శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. హోంమంత్రి, తలసాని, మేయర్​.. తదితరులు సాయికిరణ్​తో పాటు ఉన్నారు.

తలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​
author img

By

Published : Mar 25, 2019, 12:31 PM IST

Updated : Mar 25, 2019, 12:52 PM IST

తలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​
మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ కుమారుడు సికింద్రాబాద్​ లోక్​సభ తెరాస అభ్యర్థి సాయికిరణ్ హైదరాబాద్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా సాయికిరణ్.. నాన్నమ్మ, తండ్రి తలసాని శ్రీనివాస్ వద్ద ఆశీస్సులు తీసుకుని ర్యాలీకి బయలుదేరారు.

తెరాస శ్రేణులతో భారీ ర్యాలీ

అనంతరం అసెంబ్లీ వద్ద ఉన్న గన్​పార్క్​ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి... నామినేషన్ వేసేందుకు తెరాస శ్రేణులతో కలిసి వెళ్లారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్​ అలీ, మంత్రి తలసాని, మేయర్​ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్​ బాబా ఫాసిఉద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా... గన్​పార్క్​​ ప్రాంగణం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది.

ఇదీ చూడండి: నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు

Note: Script Ftp
Last Updated : Mar 25, 2019, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.