లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెరాస సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐడీహెచ్ కాలనీలో జ్యోతిష్యులు లక్ష్మీకాంత్ శర్మతో కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాదాపు 200 మంది నిరుపేదలకు సరకులు అందజేశారు.
ఎట్టి పరిస్థితుల్లో వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రావొద్దని సాయికిరణ్ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని ఆయన కోరారు..ఇలాంటి విపత్కర సమయంలో మారుతి జ్యోతిష్యాలయం లక్ష్మీకాంత్ శర్మ పేదల కోసం నిత్యావసర సరుకులను అందజేయడం అభినందనీయమని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'