ETV Bharat / state

'రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోండి' - రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్

రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్న రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కిసాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డిలు బహిరంగ లేఖ రాశారు.

take-action-on-rice-millers-says-kisan-congress
'రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోండి'
author img

By

Published : Apr 22, 2020, 1:11 PM IST

వరిధాన్యం కొనుగోలులో చేతివాటం ప్రదర్శించి రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్న రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కిసాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డికి ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డిలు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి... రైస్‌ మిల్లులకు చేరిన తరువాత వివిధ సాకులు చెప్పి క్వింటాలుకు అయిదారు కిలోలు తరుగు కింద తీస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కోదండరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. ప్రధానంగా నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో రైస్‌ మిల్లర్లు తరుగు తీస్తూ.. రైతులకు అన్యాయం చేస్తున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లగా... తమ దృష్టిలో కూడా ఉన్నట్లు వారు తెలిపారన్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి... ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ఇప్పటికే ఆలా నష్టపోయిన రైతులకు కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.