సమస్యల పరిష్కారంలో పౌరులను భాగస్వామ్యులను చేస్తూ ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైప్ సెంటర్ టీ-వర్క్స్.. 'మేక్ ఎ థాన్' పేరుతో ఒక ఈవెంట్‌కు అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా కొవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు ఇన్నోవేటివ్ పరిష్కారాలు సూచించాలని విద్యార్థులను టీ-వర్క్స్ ఆహ్వానించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 300 వరకు ప్రతిస్పందనలు వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఇన్నోవేటివ్ విద్యార్థులు ప్రతిపాదించిన పరిష్కారాలతో.. కొవిడ్ సమస్యకు చెక్ పెట్టే ప్రోటో టైపులను టీవర్క్స్ టీం రూపొందించింది. వాటిలో కొన్ని వ్యక్తిగత దూరాన్ని సూచించే పరికరాలు, దానంతట అదే శానిటైజ్ చేసుకునే డోర్ హ్యాండిల్, వ్యక్తిగత దూరాన్ని చెరిపేసి దగ్గరకు వస్తే వారించే అలారం వంటి ఉత్పత్తులను టీవర్క్స్ ఎంపికచేసింది. నవంబర్ 7న ఎంపికైన ఈ ఇన్నోవేషన్లను వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రదర్శిస్తామని.. టీవర్క్స్ ఫేస్బుక్ పేజ్ ద్వారా ప్రజలు వీటిని వీక్షించవచ్చని టీవర్క్స్ ప్రకటించింది.
ఇవీ చూడండి: పంచాయతీలపై విద్యుత్ దీపాల భారం!