రిజిస్ట్రేషన్ శాఖలో ఈ నెల 16 నుంచి టీ-వాలెట్ ద్వారా 14 రకాల సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. గడిచిన పది రోజుల్లో 49,492 మంది ఈ యాప్ ద్వారా సేవలు పొందగా... రిజిస్ట్రేషన్ శాఖకు రూ.1.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. టీ-వాలెట్ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండానే పని పూర్తవుతోందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత కాలపరిమితిలో పనులు పూర్తయిపోతాయి. ప్రజలు తమకు ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. పనికోసం ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన పనిలేదు. అన్ని కార్యాలయాల్లో ఈ విషయంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చిరంజీవులు తెలిపారు.
14 రకాల సేవలు....
టీ-వాలెట్ ద్వారా ఈసీ, సీసీ, మార్కెట్ విలువ ధ్రువపత్రం, వివాహ రిజిస్ట్రేషన్, సేల్ ఆఫ్ స్టాంప్స్, ఫ్రాంకింగ్, సమాచార హక్కు, స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ, సొసైటీలు, సంస్థలు, ప్రైవేట్ అటెండెన్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌లపై సేకరించే ఖర్చు, జరిమానాలు తదితరాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇవీ చూడండి: పల్లె అభివృద్ధికి 60రోజుల ప్రణాళిక..!