యాజమాన్యం తమకు కమీషన్ తక్కువగా ఇస్తోందని హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 2 కిలోమీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటెమ్కు 35 రూపాయల కమిషన్ ఇస్తున్న స్విగ్గీ.. ఇప్పుడు ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని ఆరోపించారు.
యాజమాన్యం థర్టీ పార్టీకి ఎక్కువ కమీషన్ ఇస్తూ... తమకు మాత్రం తక్కువ కమీషన్ ఇస్తోందన్నారు. స్విగ్గీ కంపెనీపై మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్కు వచ్చిన స్విగ్గీ ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రేపటితో శాసనసభ సమావేశాలు వాయిదా!