భారతదేశ ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద.. అందరికి ఆదర్శప్రాయుడని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య కొనియాడారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో వెల్ బీయింగ్ హ్యుమానిటీ ఆర్గనేషన్ ఆధ్వర్యంలో జరిగిన 158వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివేకానందుడు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి.. సమాజాన్ని జాగృతం చేశారని అన్నారు. అందరు వివేకానందుని అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. యువత సన్మార్గాన్ని ఎంచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి.. యూత్ నేషనల్ యూనిటీ అవార్డ్స్‌ని జస్టిస్ చంద్రయ్య ప్రధానం చేశారు.
ఇదీ చూడండి: బ్రెజిల్‌కు కొవాగ్జిన్- భారత్ బయోటెక్‌తో డీల్