ETV Bharat / state

Swachhata Hi Seva 2023 Telangana : రాష్ట్రవ్యాప్తంగా 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం.. చీపుర్లు పట్టిన ప్రముఖులు - నటి అమల ఇన్​ స్వచ్ఛత హి సేవ

Swachhata Hi Seva 2023 Telangana : అక్టోబర్​ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రముఖ నాయకులందరూ స్వచ్ఛ భారత్​లో పాల్గొని.. పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై పాల్గొని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.

Film Stars on swachhata hi seva
Governor On swachhata hi seva
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 2:31 PM IST

Governor On swachhata hi seva : 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

Swachhata Hi Seva 2023 Telangana : మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు స్వచ్ఛతా హీ సేవా(swachhata hi seva) కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నాయకులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ స్వచ్ఛ భారత్​ కార్యక్రమం నిర్వహించారు. రాజ్​భవన్ లోపలి రహదారులను పరిశుభ్రం చేశారు. చుట్టు పక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుంచి పరిరక్షించుకోవచ్చని తెలిపారు. నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

  • Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @baiyanpuria pic.twitter.com/gwn1SgdR2C

    — Narendra Modi (@narendramodi) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MP Kishan Reddy Participate in Swachh Bharat : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని.. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లకుంటలోని శంకర్ మట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికంగా రోడ్ల వెంట ఉన్న చెత్తను కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. జీహెచ్​ఎంసీ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ సైతం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను చెత్తను పరిశుభ్రం చేసుకోవటం ద్వారా స్వచ్ఛ భారత్​లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Swachh Bharat Mission 2022 : స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ఆదర్శంగా కొత్తగూడెం..

National Statistics Department Staff on Swachh Bharat : ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జాతీయ గణాంక శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయంలో స్వచ్చత కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సెలవు రోజైనా.. ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయానికి చేరుకుని స్వచ్చందంగా స్వచ్ఛ భారత్​ పనులు చేశారు. కార్యాలయ పరిసరాల్లోని చెత్తను ఏరివేసి పరిశుభ్రత పనులు చేపట్టారు. ఉద్యోగులు, సిబ్బంది వారి వారి కుటుంబసభ్యులతో కలిసి గంటపాటు కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు.

Film Stars on swachhata hi seva 2023 : హైదరాబాద్​లోని ఐమ్యాక్సి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, నటి అక్కినేని అమల(Akkineni Amala), సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత భారీగా పాల్గొన్నారు. నటి అక్కినేని అమల, సుద్దాల అశోక్ తేజ ఐ మ్యాక్స్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

Collector Varun Reddy on One day one hour Programme : నిర్మల్​ జిల్లాలో కలెక్టర్​ ఏక్​ తారీఖ్​ ఏక్​ గంట కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్​ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

ఈ ఏడాది మనమే నెం.1.. గ్రామీణ స్వచ్ఛ అవార్డుల్లో 13 మనవే..

Vijayashanthi on TRS: తెరాసను గద్దె దించేది ఒక్క భాజపానే: విజయశాంతి

అక్టోబరు 2 నాటికి 'ఓడీఎఫ్ భారత్' సాధ్యమే: నిర్మల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.