కరోనా కట్టడి చర్యల్లో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సంక్షేమానికి సువెన్ ఫార్మా లిమిటెడ్ విరాళం ప్రకటించింది. రూ.50లక్షలు చెక్కును ఆ సంస్థ ఛైర్మన్, సీఈవో వెంకట్ జాస్తి... డీజీపీ మహేందర్ రెడ్డికి అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసు శాఖ సేవలను ఆయన ప్రశంసించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది కోసం అవసరమైన పరికరాలు అందించాలని ఆయన కోరారు. నిత్యావసరాలు, మందులు తదితర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసుల కృషిని అభినందించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోని 23 జిల్లాలకు వ్యాపించిన వైరస్