హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు, అభాగ్యులకు సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందిస్తున్నారు. చిన్నారులకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. చిక్కడ పల్లి, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, వీఎస్టీ రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి.
రోజుకు సుమారు 500 నుంచి 1000 వరకు...
ప్రతి రోజు సుమారు 500 నుంచి 1000 మందికి అన్నం, నీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ రాజేష్ బెస్త వెల్లడించారు. వైద్యపరంగా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుండగా... వలస కార్మికులకు తమ వంతు సహాయంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మురికి వాడలు, కాలనీల్లో పర్యటిస్తూ దశలవారీగా పంపిణీ చేస్తున్నట్లు రాజేశ్ వివరించారు. లాక్ డౌన్ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల కృషి మరువలేనిదని స్థానికులు ప్రశంసిస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ బెస్త, తదితరులు పాల్గొన్నారు.