ETV Bharat / state

Suspicious death in Gachibowli police station : పోలీస్​స్టేషన్​లో బిహార్​ వలసకూలీ అనుమానాస్పద మృతిపై.. విచారణకు ఆదేశం - Suspicious death in Gachibowli police station

Bihar worker Nitish death in Gachibowli PS : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని బిహార్‌కు చెందిన నితీష్​గా గుర్తించారు. మృతుడు నానక్‌రామ్‌గూడలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్.. బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.

death
death
author img

By

Published : Jul 17, 2023, 9:28 AM IST

Updated : Jul 17, 2023, 1:37 PM IST

గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​లో .. బిహార్​ వలసకూలీ అనుమానాస్పద మృతి

Suspicious death in Gachibowli police station : హైదరాబాద్​కు నిత్యం బతుకుదెరువు నిమిత్తం వివిధ రాష్ట్రాలనుంచి ఎంతో మంది వలస కూలీలు వస్తుంటారు. వీరు పనిచేసే ప్రాంతాల్లో, కొన్నిసార్లు వారి మధ్య గొడవలు చోటు చేసుకుని.. అవి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడి దెబ్బలకు తట్టుకులేక.. చివరకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

నానక్​రామ్​గూడలో ఉంటున్న వలసకూలీలలకు మధ్య గొడవలు చెలరేగి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న బిహార్​కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బిహార్‌కు చెందిన నితీశ్.. నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడి భద్రత సిబ్బంది, ఇతర కార్మికులకు మధ్య గొడవ జరిగింది. వీరంతా రెండు బృందాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న ముగ్గురిలో ఒకరు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతణ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీస్‌ కస్టడీలో అతను మృతి చెందినట్టు కేసు నమోదు చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అయితే నితీష్‌ పోలీస్‌స్టేషన్‌లోని రిసెప్షన్‌ వద్ద ఉండగానే కుప్పకూలిపోయాడని డీసీపీ వివరించారు. ఈ మేరకు ఘటన పై సీపీ ఆదేశాల మేరకు విచారణ కూడా జరుగుతోందన్నారు.

"గచ్చిబౌలి పోలీస్​స్టేషన్ పరిధిలో నానక్​రామ్​గూడలోని ఓ లేబర్ క్యాంప్​లో గొడవలు జరుగుతున్నాయంటూ డయల్ 100 కు కాల్ వచ్చింది. అక్కడికి వెళ్లిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​లో నితీశ్ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే సీపీఆర్ చేశారు. హుటహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీస్‌ కస్టడీలో అతను మృతి చెందినట్టు కేసు నమోదు చేశారు". - శిల్పవల్లి, మాాదాపూర్ డీసీపీ

అసలీ వివాదానికి అసలు కారణం మాత్రం ఇంకా తెలియడం లేదు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నామని.. చెబుతున్నారు కానీ అసలు ఏం జరిగిందోనన్న విషయంపై మాత్రం పెదవి విప్పడం లేదు. భవన నిర్మాణ కంపెనీ ప్రతినిధులు కూడా ఇంకా ఏం చెప్పలేదు. మరోవైపు తాజా ఘటనతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని భయపడుతున్నారు. చనిపోయిన వ్యక్తిని న్యాయం జరిగేవరకు పనులకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు చనిపోయిన వ్యక్తిని లాకప్ డెత్ చేశారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిర్మాణ ప్రదేశంలో జరిగే గొడవలో దెబ్బలు తగిలే నితీష్ చనిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై యాజమాన్యం ఏదైనా ప్రకటన చేసేవరకు ఈ విషయంలో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. పోలీసులు మాత్రం దర్యాప్తు పూర్తి అయ్యాకే దీనిని స్పందిస్తామని చెబుతున్నారు.

బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ.. గచ్చిబౌలి పీఎస్‌లో జరిగిన కస్టోడియల్ డెత్‌పై విచారణ కొనసాగుతోంది. మేజిస్ట్రేట్.. బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఉస్మానియా ఆస్పత్రిలో నితీశ్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించనున్నారు.పోస్టుమార్టం అనంతరం బిహార్‌కి తరలించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 17, 2023, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.