రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంపై అనుమానం వ్యక్తం చేశారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా కేసులు తగ్గడం సంతోషకరమే.. కానీ ఇతర రాష్ట్రాల్లో వేలల్లో పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం లేదని బండి ఆరోపించారు. ప్రతిరోజూ 2 వేలకుపైగా కరోనా పరీక్షలు చేసేందుకు కేంద్రం సౌకర్యాలు కల్పించిందని వెల్లడించారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలను స్మరించుకుంటామన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని తెలిపారు. కరోనాతో యుద్ధంలో భారతదేశం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గుతోన్న కరోనా కేసులు